: టీమిండియా స్పాన్సర్ షిప్ కు టెండర్లు ఆహ్వానించిన బీసీసీఐ
చాలాకాలం తరువాత టీమిండియా స్పాన్సర్ షిప్ కు బీసీసీఐ టెండర్లను ఆహ్వానించింది. చాలా కాలంగా సహారా ఇండియా భారత జట్టుకు అధికారిక స్పాన్సర్ గా వ్యవహరించింది. అయితే తమ ఫ్రాంచైజీ పూణే వారియర్స్ విషయంలో బీసీసీఐతో నెలకొన్న వివాదం కారణంగా... సహారా ఇండియా తన స్పాన్సర్ షిప్ ను ఫిబ్రవరిలో ఉపసంహరించుకుంది. దీంతో బీసీసీఐ ఇప్పటి వరకు టీమిండియా స్పాన్సర్ షిప్ వ్యవహారాలు చూసింది. ఈ నేపథ్యంలో, జనవరి 2014 నుంచి మార్చి 2017 వరకు స్పాన్సర్ గా వ్యవహరించే సంస్థ కోసం బీసీసీఐ ప్రకటన విడుదల చేసింది.