: రోడ్డు ప్రమాదంలో భర్త మృతి.. భార్యకు తీవ్ర గాయాలు
ద్విచక్ర వాహనంపై వెళ్తున్న భార్యాభర్తలను ప్రైవేటు పాఠశాలకు చెందిన బస్సు ఢీకొనడంతో భర్త సత్యనారాయణ (65) అక్కడికక్కడే మృతి చెందారు. అతని భార్య పార్వతికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన పశ్చిమగోదావరి జిల్లా పెరవలి మండలం ఖండవల్లి దగ్గర జరిగింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పార్వతిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.