: సీమాంధ్ర మంత్రులు, ఎంపీలు కేంద్రానికి తొత్తులు : అశోక్ బాబు
సీమాంధ్ర ప్రాంతానికి చెందిన మంత్రులు, ఎంపీలు కేంద్రానికి తొత్తులుగా మారారని ఏపీఎన్జీవో అధ్యక్షుడు అశోక్ బాబు మండిపడ్డారు. హైదరాబాద్ లో ఆయన మాట్లాడుతూ సీమాంధ్ర ప్రాంత నేతలే ఆ ప్రాంతానికి శాపంగా మారారని అన్నారు. రాష్ట్రాన్ని విభజిస్తే ప్యాకేజీలు కావాలని ఆ ప్రాంత నేతలే అడుగుతుండడం దురదృష్టమని ఆయన పేర్కొన్నారు. అసెంబ్లీకి ముసాయిదా వస్తే సుప్రీంకోర్టుకు వెళతామని అశోక్ బాబు స్పష్టం చేశారు.
ఈ నెల 24న ఉద్యోగ సంఘాలతో సమావేశం నిర్వహిస్తున్నామని ఆయన వెల్లడించారు. ప్రస్తుతం అసెంబ్లీలో విభజన తీర్మానం పెట్టాల్సిందేనని ఆయన డిమాండ్ చేశారు. అసెంబ్లీలో తీర్మానం నెగ్గితే అప్పుడు విభజించాలని ఆయన పేర్కొన్నారు. పార్లమెంటులో బిల్లు విభజనకు వస్తే అడ్డుకునేందుకు తాము ప్రణాళిక రచించామని అశోక్ బాబు తెలిపారు.