: యూపీఏ అవినీతికి హద్దే లేదు: వెంకయ్యనాయుడు
యూపీఏ-2 పాలనపై బీజేపీ సీనియర్ నేత వెంకయ్యనాయుడు మరోసారి మండిపడ్డారు. యూపీఏ ప్రభుత్వంలో అవినీతికి హద్దు లేకుండా పోయిందన్నారు. ఇప్పటికే పీకల్లోతు అవినీతిలో మునిగిపోయిందని వ్యాఖ్యానించారు. దేశంలోని సమస్యలకు కాంగ్రెస్సే కారణమని ఆరోపించారు. ప్రతి అంశాన్ని కాంగ్రెస్ తన సొంత వ్యవహారంగా చూస్తోందన్న వెంకయ్యనాయుడు, మోడీ ప్రాభవాన్ని హస్తం పార్టీ తట్టుకోలేకపోతోందని చెప్పారు. హైదరాబాదులోని బీజేపీ కార్యాలయంలో పార్టీ నేతలతో కలిసి మీడియా తో మాట్లాడిన ఆయన, విభజన వ్యవహారంలో కేంద్రం తీరును తప్పుబట్టారు. అధిష్ఠానం దర్శకత్వంలోనే సీఎం కిరణ్ సమైక్య నాటకమాడుతున్నారని విమర్శించారు.