: ఏవీఎస్ సేవలు మరువలేము: చంద్రబాబు


నటుడిగా, టీడీపీ నేతగా ఏవీఎస్ చేసిన సేవలను మరువలేమని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు తెలిపారు. ఫిలిం ఛాంబర్ వద్ద ఏవీఎస్ భౌతిక కాయాన్ని సందర్శించి నివాళి తెలిపిన చంద్రబాబు మీడియాతో మాట్లాడారు. ఏవీఎస్ అందర్లోనూ కలిసిపోయే మనిషని, టీడీపీ ఏ కార్యాక్రమం చేపట్టినా ముందుండి నడిపించే వారని కొనియాడారు. ఆయన మృతి పార్టీకి, సీనీ రంగానికి తీరని లోటన్నారు. ఏవీఎస్ కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానని చంద్రబాబు నాయుడు తెలిపారు.

  • Loading...

More Telugu News