: ప్రధానితో ముగిసిన సీఎం, రాష్ట్ర నేతల భేటీ
ఢిల్లీలో ప్రధాని మన్మోహన్ సింగ్ తో ముఖ్యమంత్రి కిరణ్, ఉప ముఖ్యమంత్రి దామోదర, పీసీసీ చీఫ్ బొత్స, చిరంజీవితో పాటు మిగతా నేతల భేటీ ముగిసింది. రాష్ట్రంలో తుపాను, వరద నష్టంపైనే ఎక్కువగా చర్చ జరిగింది. తుపాను బాధితులకు త్వరగా సహాయం చేయాలని నేతలు కోరారు. దీనికి స్పందించిన ప్రధాని రెండు రోజుల్లో కేంద్ర బృందాన్ని రాష్ట్రానికి పంపిస్తామని హామీ ఇచ్చారు. ఈ సమయంలో రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని ప్రధానికి మంత్రి శైలజానాథ్ వినతిపత్రం సమర్పించారు.