: ఇడుపులపాయ చేరుకున్న జగన్
వైఎస్సార్ సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి 20 నెలల సుదీర్ఘవిరామం తరువాత పులివెందులలో అడుగుపెట్టారు. 2012 ఫిబ్రవరి 11న ఇడుపులపాయ వెళ్లిన జగన్ తదనంతర పరిణామాలతో స్వస్థలానికి వెళ్లలేకపోయాడు. వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ లో ఎర్రగుంట్ల రైల్వేస్టేషన్ లో దిగి నేరుగా ఇడుపులపాయలో తండ్రి సమాధికి నివాళులర్పించి పులివెందుల చేరుకున్నారు. నేడు రేపు పులివెందులలో ఆయన గడపనున్నారు.