: డాషింగ్ హీరో సూర్య భయం


సినిమాల్లో వంద మంది రౌడీలను సునాయాసంగా చితక్కొట్టే హీరో భయపడుతున్నాడు. ముష్కరుల్ని కంటి చూపుతో భయపెట్టే హీరోని భయపెడుతోంది ఎవరో విలన్ కాదు భారత సమాజమే. సమాజంలో జరుగుతున్న అత్యాచారాలపై హీరో సూర్య తల్లడిల్లిపోతున్నాడు. మహిళలపై జరుగుతున్న అత్యాచారాలకు వ్యతిరేకంగా తెరకెక్కిన మాలిని 22 పాలయం సినిమా ఆడియో వేడకలో తన భయాన్ని సూర్య వెల్లడించాడు.

'భవిష్యత్తు సమాజంలో నా కుమార్తెను వూహిస్తేనే భయమేస్తోందని' అన్నారు. 'ప్రస్తుతం జరుగుతున్న నేరాలను చూస్తుంటే శరీరం భయంతో కంపించిపోతోందని' అన్నాడు. 'ఇప్పుడే ఇలా ఉంటే భవిష్యత్తులో ఈ పరిస్థితులు ఎంత తీవ్రంగా ఉంటాయో'నని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సినిమాలో చూపించిన దృశ్యాలు సమాజంలోని నిజమైన సంఘటనల్లా కనిపిస్తున్నాయన్నారు.

  • Loading...

More Telugu News