: మన చదరంగానికి మరో గుర్తింపు


ప్రపంచవ్యాప్తంగా చదరంగానికి ఎంతో పేరుంది. ఈ ఆట మనదేశంలోనే రూపొందినట్టు చెబుతుంటారు. ఈ ఆట ఇప్పుడు మరో ఖ్యాతిని సొంతం చేసుకుంది. ప్రపంచవ్యాప్తంగా అత్యంత ఆదరణ ఉన్న ఆటల్లో చెస్‌ రూపంలో చెప్పుకుంటున్న చదరంగం ఒకటి. ఈ ఆటను నేషనల్‌ టాయ్‌ హాల్‌ ఆఫ్‌ ఫేమ్‌లో చేర్చారు. ఇందులో చోటు కల్పించడానికి ప్రతి ఏడాదీ ఎవరైనా ప్రతిపాదనలను పంపించవచ్చు.

అమెరికా నేషనల్‌ టాయ్‌ హాల్‌ ఆఫ్‌ ఫేమ్‌లో గురువారం నాడు జరిగిన వేడుకలో రబ్బర్‌ డక్‌తోబాటు చెస్‌ను ఇందులో చేర్చారు. ఇందులో ఇంకా బార్బీ, జిగ్‌సా పజిల్‌, పేకముక్కలు, రోలర్‌ స్కేట్స్‌తోబాటు 53 బొమ్మలు, పలు క్రీడాసాధనాలకు చోటు కల్పించారు. ఇప్పుడు చెస్‌ కూడా ఇందులో స్థానం సంపాదించింది. ఇంకా పచ్చీసు ఆట కూడా ఈ హాల్‌లో చోటు దక్కించుకుంది.

  • Loading...

More Telugu News