: మహాకుంభమేళాలో స్వల్ప అగ్నిప్రమాదం


అలహాబాదులో జరుగుతున్న మహాకుంభమేళాలో మరోసారి స్వల్ప అగ్నిప్రమాదం జరిగింది. ఇక్కడ ఏర్పాటు చేసిన తాత్కాలిక నగరం (సెక్టార్ 4) లోని మూడు టెంట్లు, సామాన్లు భద్రపరిచే ఒక గదికి కూడా మంటలు పాకాయి. దీంతో ఇక్కడ నిల్వ చేసిన ఆహరపదార్ధాలు అగ్నికి ఆహుతయ్యాయి. అయితే ఎటువంటి ప్రాణ నష్టం లేదని అధికారులు తెలిపారు. గ్యాసు సిలిండర్ లీకేజీ వల్ల ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. కుంభమేళా ప్రారంభమైన కొద్దిరోజులకే ఓ సారి అగ్నిప్రమాదం జరిగిన విషయం తెలిసిందే.

  • Loading...

More Telugu News