: కిరణ్ కు సీఎం పదవిలో కొనసాగే అర్హత లేదు: దత్తాత్రేయ
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిపై ఆరోపణలు, విమర్శలు తీవ్రతరమయ్యాయి. రాష్ట్ర విభజన విషయంలో రాజ్యాంగ విలువలను అపహాస్యం చేస్తున్న కిరణ్ కు సీఎం పదవిలో కొనసాగే అర్హత లేదని బీజేపీ నేత బండారు దత్తాత్రేయ అన్నారు. వెంటనే కాంగ్రెస్ అధిష్ఠానం నుంచి కిరణ్ ను పదవి నుంచి తప్పించాలని ఆయన డిమాండ్ చేశారు. హైదరాబాదులో రోడ్ల దుస్థితిని నిరసిస్తూ హైదరాబాదులోని ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ వద్ద గ్రేటర్ బీజేపీ తలపెట్టిన రోడ్ల మరమ్మత్తుల కార్యక్రమంలో దత్తాత్రేయ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. పార్టీ అధిష్ఠానం పదవినుంచి తప్పించకముందే కిరణే వైదొలగాలన్నారు.