: సర్కారు ఉద్యోగం కావాలంటే చెడు అలవాట్లు వదిలేయాల్సిందే


రాజస్థాన్ లో సర్కారు ఉద్యోగం కావాలంటే అభ్యర్థులు పరీక్షలలో నెగ్గితే సరిపోదు.. బుద్ధిమంతులై ఉండాలి. అంటే పొగతాగే అలవాటు, గుట్కాలు నమిలే చెడు అలవాట్లు ఉండరాదు. అప్పుడే వారు ఉద్యోగం పొందడానికి అర్హులు. ఈ మేరకు అక్కడి సిబ్బంది వ్యవహారాల శాఖ అన్ని శాఖలకు, జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది. ఇలాంటి అలవాట్లు లేని వారినే ఉద్యోగాల్లోకి తీసుకోవాలని ఆదేశించింది. ఈ నిర్ణయం చాలా మంచిదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

  • Loading...

More Telugu News