: విజయవంతమైన అగ్ని క్షిపణి పరీక్ష


భారత రక్షణ శాఖ అమ్ముల పొదిలో పదునైన అస్త్రం చేరింది. ఉపరితలంలోని 700 కిలో మీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాల్ని ఛేధించే అగ్ని-1 క్షిపణి ప్రయోగం మరోసారి విజయవంతమైంది. అగ్ని క్షిపణిలోని పలు శ్రేణులలో ఈ క్షిపణి మరింత సమర్థవంతంగా లక్ష్యాన్ని చేధిస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఒడిశా బాలాసోర్ లోని మొబైల్ లాంచ్ ప్యాడ్ 4 నుంచి ఉదయం 09:33 నిమిషాలకు క్షిపణిని విజయవంతంగా పరీక్షించారు. ఇది వెయ్యి కేజీల పేలుడు పదార్థాలను మోసుకెళ్లగలదు. అత్యంత కచ్చితత్వంతో లక్ష్యాన్ని క్షణాల్లో చేధించగలదు. దీని వల్ల జరిగే నష్టం కూడా తీవ్రంగా ఉంటుందని రక్షణ శాఖ తెలిపింది.

  • Loading...

More Telugu News