: ఢిల్లీ చేరుకున్న ముఖ్యమంత్రి కిరణ్


ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఢిల్లీ చేరుకున్నారు. ఈ సాయంత్రం రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ ఛార్జ్ దిగ్విజయ్ సింగ్ అధ్యక్షతన జరిగే కాంగ్రెస్ సమన్వయ కమిటీ సమావేశంలో ఆయన పాల్గొంటారు. ఈ సమావేశానికి సీఎంతో పాటు రాష్ట్రానికి చెందిన కేంద్రమంత్రి చిరంజీవి, ఇప్పటికే ఢిల్లీలో ఉన్న ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ, పీసీసీ చీఫ్ బొత్స సత్యానారాయణ హాజరవుతున్నారు. ఇదిలావుంటే రేపు ఉదయం పదిన్నర గంటలకు ప్రధానిని కలవాలని ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రి, పీసీసీ చీఫ్ కు ప్రధాని కార్యాలయం నుంచి పిలుపు వచ్చింది.

  • Loading...

More Telugu News