: పంట రుణాల మాఫీలో ఎలాంటి అక్రమాలు జరగలేదు: శరద్ పవార్


రైతులకు పంట రుణాల మాఫీలో అవినీతి జరిగిందన్న విపక్షాల ఆరోపణలపై లోక్ సభలో కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి శరద్ పవార్ వివరణ ఇచ్చారు. పంట రుణాల మాఫీలో ఎటువంటి అక్రమాలు చోటు చేసుకోలేదని ఆయన సభలో తెలిపారు.

అంతకు ముందు ఒకసారి వాయిదా అనంతరం 12 గంటలకు మొదలైన సభలో విపక్ష సభ్యులు మళ్లీ పంట రుణాల మాఫీ అంశాన్ని లేవనెత్తారు. దీంతో స్పందించిన పవార్, పంట రుణాల మాఫీపై కాగ్ నుంచి సమగ్ర నివేదిక ఇవ్వాలని కోరతామని వెల్లడించారు.  

  • Loading...

More Telugu News