: ఢిల్లీ బయల్దేరిన సీఎం
ముఖ్యమంత్రి కిరణ్ కొద్దిసేపటి క్రితం ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. కాంగ్రెస్ సమన్వయ కమిటీ మీటింగ్ లో సీఎం పాల్గొననున్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు వ్యవహారంలో ఏకాభిప్రాయం సాధించే క్రమంలోనే ఈ భేటీని కాంగ్రెస్ అధిష్ఠానం ఏర్పాటుచేస్తోంది. ఈ పర్యటనలో సోనియాగాంధీతో సీఎం భేటీ అయ్యే అవకాశముందని తెలుస్తోంది. దీనికితోడు, సీఎంను మార్చే అవకాశం ఉందన్న వార్తలు హల్ చల్ చేస్తున్న నేపథ్యంలో... కిరణ్ హస్తిన టూర్ ప్రాధాన్యం సంతరించుకుంది.