: పాక్ తాలిబాన్ అధినేతగా ముల్లా ఫజలుల్లా నియామకం
పాక్ నూతన తాలిబాన్ అధినేతగా ముల్లా ఫజలుల్లాను నియమించినట్టు తాలిబాన్ వర్గాలు పేర్కొన్నాయి. మలాలాను చంపాలన్న ఇతని ఆదేశాలతోనే తాలిబాన్లు ఆమెపై కాల్పులు జరిపిన విషయం తెలిసిందే. తెహ్రీక్ తాలిబాన్ అధినేత హకీముల్లా మహసూద్ స్థానంలో ముల్లా ఫజలుల్లాను నియమించారు. గతవారం అమెరికా జరిపిన ద్రోన్ దాడిలో హకీముల్లా హతమయిన సంగతి తెలిసిందే.