: అక్కడ మగువలకు చెట్లెక్కడానికి శిక్షణనిస్తున్నారు


చెట్లెక్కడానికి శిక్షణ ఎందుకు అనుకుంటున్నారా... అయితే మీ పెరట్లో కొబ్బరి చెట్టు ఉంటే దాన్ని ఎక్కడానికి ప్రయత్నించండి... ఎక్కలేరు. ఎందుకంటే అది నిటారుగా ఉంటుంది. అదే పక్క కొమ్మలతో విశాలంగా పరుచుకుని ఉన్న చెట్లను మనం తేలికగా ఎక్కేస్తాం. కానీ కొబ్బరి, తాటి వంటి నిటారుగా ఉండే చెట్లను ఎక్కడం కాస్త కష్టమైన పని. కాబట్టే ఇలాంటి చెట్లను ఎక్కడంలో కేరళ రాష్ట్ర ప్రభుత్వం శిక్షణనివ్వాలని నిర్ణయించుకుంది. అందునా మగువలకు శిక్షణనివ్వాలని ఆ ప్రభుత్వం నిర్ణయించుకుంది.

మగువలు ఏ విషయంలోనైనా చక్కటి రాణింపును కనబరుస్తారనే విషయం అందరికీ తెలిసిందే. అందుకే చెట్లు ఎక్కడంలో కూడా ఆడవారు చక్కగా రాణించగలరని భావించి ఆ పనిలో శిక్షణనివ్వాలనుకుంది కేరళ ప్రభుత్వం. ఎందుకంటే కేరళలో కొబ్బరి పంట విస్తారంగా పండుతుంది. ఈ పంటలో మగువలను కూడా భాగస్వాములు చేయాలని, వారికి కూడా చెట్లను ఎక్కడంలో ఉపాధి అవకాశాలను కల్పించాలని భావించి కేరళ ప్రభుత్వం ఇలాంటి నిర్ణయాన్ని తీసుకుంది. అంతేకాదు మగువల భాగస్వామ్యంతో కేరళలో కొబ్బరి పంట విస్తీర్ణాన్ని పెంచాలని కూడా ఆ రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఇలా పంట విస్తీర్ణాన్ని పెంచుకోవడంతోబాటు మగువలకు ఉపాధి అవకాశాలను మెరుగు పరచవచ్చని ప్రభుత్వం ఆలోచిస్తోంది.

దీనికితోడు అక్కడ రోజురోజుకూ చెట్లెక్కే మగవారి సంఖ్య తగ్గిపోతోందట. దీనికి ప్రత్యామ్నాయంగా మగువలకు చెట్లెక్కడంలో శిక్షణనిచ్చి వారిద్వారా కొబ్బరికాయలను దింపించడం చేయవచ్చని ఆ ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పుడు కేరళ పడతులు సెంట్రల్‌ ప్లాంటేషన్‌ క్రాప్స్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ వారు సృష్టించిన మెషిన్ల సాయంతో చక్కగా చెట్లెక్కేసి కొబ్బరికాయలను దించడం నేర్చుకుంటున్నారట.

  • Loading...

More Telugu News