: ఈ ఉల్లితో బరువు పెరగరట
ఉల్లిగడ్డలను మనం సాధారణంగా వంటకాల్లో విరివిగా ఉపయోగిస్తుంటాం. ఇటీవల ధరల పెరుగుదల కారణంగా వాటిని తక్కువ వాడుతున్నాం. కానీ ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదని సామెత. ఉల్లి వల్ల బోలెడు ప్రయోజనాలున్నాయి, కాబట్టి ఉల్లిని ఎక్కువగా వాడండి అని నిపుణులు చెబుతుంటారు. ఇలాంటి ఉల్లిని కూరల్లో వేయడానికి కోస్తుంటే ఎంతటి వారికైనా కన్నీళ్లు రాక మానవు. అలాకాకుండా కోసే సమయంలో కంటనీరు పెట్టించని ఉల్లి గడ్డలను శాస్త్రవేత్తలు సృష్టించారు. ఈ ఉల్లిలో మామూలు ఉల్లితో పోల్చుకుంటే మరిన్ని సుగుణాలున్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
ఉల్లిగడ్డలను కోసే సమయంలో వాటిలో ఉండే ఒకరకమైన ప్రోటీను కారణంగా మనకు కంట్లో నీరు రావడం జరుగుతుంది. అలాకాకుండా ఈ ప్రోటీను తక్కువగా ఉండే ఉల్లిని కోలిన్ సి ఈడీ నేతృత్వంలోని పరిశోధకుల బృందం సృష్టించింది. ఈ ఉల్లిని వాడడం వల్ల గుండె జబ్బుల బారిన పడకుండా మనల్ని కాపాడడంతోబాటు బరువు పెరగకుండా కూడా కాపాడుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.