: రాష్ట్ర ఆదాయ వివరాలను కేంద్ర హోంశాఖకు నివేదించిన ఆర్ధిక శాఖ


రాష్ట్ర ఆదాయ వివరాలను కేంద్ర హోంశాఖకు ఆర్ధిక శాఖ నివేదించింది. 2012-13 రాష్ట్ర ఖజానాకు వచ్చే మొత్తం ఆదాయం రూ.1,27,566.74 కోట్లుగా పేర్కొంది. కోస్తాంధ్ర నుంచి రాష్ట్ర ఖజనాకు వచ్చే ఆదాయం రూ.47,937.22 కోట్లు, రాయలసీమ నుంచి వచ్చే ఆదాయం రూ.18,215.39 కోట్లు ఆదాయం కలిపి, సీమాంధ్ర నుంచి మొత్తం రూ.66,152.61 కోట్లు, తెలంగాణ నుంచి రూ.61,414.13 కోట్లు వస్తుందని పేర్కొంది. ఇక హైదరాబాద్ మినహా తెలంగాణ జిల్లాల నుంచి రాష్ట్ర ఖజానాకు వచ్చే ఆదాయం రూ.41,391.92 కోట్లుగా, కేవలం హైదరాబాద్ నుంచి రూ.20,022.21 కోట్లు వస్తుందని వివరించింది.

  • Loading...

More Telugu News