: విభజనపై కాంగ్రెస్ రెండు అభిప్రాయాలు చెప్పింది: సోమిరెడ్డి
రాష్ట్ర విభజనను కొన్ని పార్టీలు సమర్థిస్తే, మరి కొన్ని పార్టీలు వ్యతిరేకిస్తున్నాయని టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. అయితే, అధికార కాంగ్రెస్ మాత్రం భిన్నమైన రెండు అభిప్రాయాలనూ చెప్పిందన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో రాష్ట్ర విభజనపై ఎలా ముందుకు వెళతారని సోమిరెడ్డి ప్రశ్నించారు. విభజనను సమర్థిస్తూ టీఆర్ఎస్, సీపీఐ మాత్రమే జీవోఎంకు నివేదికలు పంపాయన్నారు. మిగతా పార్టీలన్నీ రాష్ట్ర విభజనపై పలు అంశాలను పేర్కొన్నారని చెప్పారు.