: మెట్రో ప్రాజెక్టులో అవినీతి ఆరోపణలు నిరాధారం : మెట్రో ఎండీ
2014 డిసెంబర్ నాటికి మెట్రో రైలును పూర్తి చేస్తామని మెట్రో రైలు ఎండీ ఎన్ వీఎస్ రెడ్డి తెలిపారు. 2015 ఉగాది నాటికి మెట్రో రైలును ప్రజలకు అందుబాటులోకి తెస్తామని చెప్పారు. మెట్రో రైలు టెండర్లు, భూ పరిహారం చెల్లింపులు పారదర్శకంగా జరిగాయన్నారు. ఈ ప్రాజెక్టుపై రాజకీయ నేతలు చేస్తున్న అవినీతి ఆరోపణల్లో వాస్తవం లేదని ఖండించారు. ఈ విషయంలో ఎలాంటి విచారణకైనా సిద్ధమని స్పష్టం చేశారు.