: మావోయిస్టులను పట్టిస్తే లక్షల నజరానా ఇస్తాం : బీహార్ సర్కార్ ఆఫర్
మావోయిస్టులను అంతమొందించేందుకు ఇప్పటి వరకు చేపట్టిన ప్రయత్నాలు విఫలమవడంతో బీహార్ ప్రభుత్వం రూటు మార్చింది. మావోయిస్టులను పట్టుకుని తమకు అప్పగించినవారికి లక్షల నజరానా ఇస్తామని ప్రకటించింది. మావోయిస్టుల కేడర్ ను బట్టి మూడు నుంచి ఐదు లక్షల నజరానా ఇస్తామని తెలిపారు. మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు అరవింద్ కుమార్ అలియాస్ అరవింద్ సింగ్ ను పట్టుకుంటే రూ.5 లక్షలు, బీహార్ ఏరియా ప్రత్యేక దళ సభ్యుడు విజయ్ యాదవ్ అలియాస్ సందీప్ తో పాటు పలువురిని పట్టుకున్నవారికి మూడు లక్షల చొప్పున బహుమతి అందజేస్తామని పేర్కొంది.