: మందు పాతరలు ఉన్నాయన్నఅనుమానంతో పోలీసుల తనిఖీలు
చిత్తూరు జిల్లా పీలేరు నియోజకవర్గంలో మందు పాతరలు ఉన్నాయన్న అనుమానంతో పోలీసులు తనిఖీలు చేపట్టారు. జిల్లాలోని కంభంవారిపల్లి, ఎరవారిపాలెం మండలాల సరిహద్దులోని జిల్లెమంద అటవీ ప్రాంతంలో ఈ తనిఖీలు నిర్వహిస్తున్నారు.
ఆరు నెలల కిందటే పోలీసులు ఇక్కడ రెండు మందుపాతరలు స్వాధీనం చేసుకున్నారు. కాగా మళ్లీ మందుపాతరలు ఉన్నాయన్న సమాచారం అందింది. దీంతో బాకారాపేట, రొంపిచెర్ల, కేవీపల్లి అటవీప్రాంతం సరిహద్దుల్లో కూడా పోలీసులు క్షుణ్నంగా తనిఖీలు చేపడుతున్నారు.