: ఆ నేత ఇంట్లో డిన్నర్ సెట్ విలువ రూ. 2కోట్లు


ఒకనాటి గ్వాలియర్ రాజవంశీయురాలు ఆమె. మరి రాజకుటుంబం అంటే వారింట్లో వస్తువులకు కూడా ఆ స్థాయి ప్రత్యేకత ఉంటుంది కదా! అందుకేనేమో ఆమె ఇంట్లో డిన్నర్ సెట్ విలువ 1.54కోట్ల రూపాయలు. మధ్యప్రదేశ్ లోని శివపురి అసెంబ్లీ స్థానానికి నామినేషన్ వేసిన యశోధరా రాజె సింధియా ఇంట్లో ఉన్న డిన్నర్ సెట్ విలువ ఇది. గ్వాలియర్ రాచకుటుంబీకుడైన మాజీ కేంద్ర మంత్రి దివంగత మాధవరావ్ సింధియా చెల్లెలు ఈమె. నామినేషన్ సందర్భంగా ఆమె తన అఫిడవిట్ ను సమర్పించింది. ఆమె దగ్గర 15,400 రూపాయల నగదు మాత్రమే ఉండగా, ఇంట్లో డిన్నర్ సెట్ మాత్రం ఖరీదైనది ఉన్నట్లు ఎన్నికల అఫిడవిట్ తెలియజేస్తోంది. అంతేకాదు యశోధర వద్ద 6,66,704 రూపాయల విలువైన డైమండ్ ఉంగరం కూడా ఉందండోయ్.

  • Loading...

More Telugu News