: బస్తర్ లో బాంబుల స్వాధీనం.. తప్పిన ముప్పు


చత్తీస్ గఢ్ లో గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ పర్యటనకు కొన్ని గంటల ముందుగా ఐఈడీ బాంబులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దీంతో పెద్ద ప్రమాదం తప్పిపోయింది. దోర్నపాల్, సుక్మా జాతీయ రహదారిపై బస్తర్ వద్ద బాంబులను ప్రత్యేక బలగాలు నిర్వీర్యం చేశాయి. మావోయిస్టులు చత్తీస్ గఢ్ లో ఈ నెల 11న జరగనున్న మొదటి దశ పోలింగ్ బహిష్కరణకు పిలుపునిచ్చారు. ఎవరి వేలుపైనానా చుక్క కనిపిస్తే వేళ్లు తీసేస్తామని హెచ్చరించారు. పోలింగ్ కు ముందు విధ్వంసం సృస్టించడానికే వీటిని అమర్చి ఉంటారని భావిస్తున్నారు. నరేంద్ర మోడీ, సోనియా ఈ రోజు బస్తర్ ప్రాంతంలో పర్యటించాల్సి ఉంది.

  • Loading...

More Telugu News