: కొనసాగుతున్న ఆర్టీఏ అధికారుల దాడులు


మహబూబ్ నగర్ జిల్లా పాలెం వద్ద జబ్బార్ ట్రావెల్స్ వోల్వో బస్సు అగ్నిప్రమాదానికి గురై 45 మంది మరణించిన నేపథ్యంలో ప్రైవేట్ ట్రావెల్స్ పై ఆర్టీఏ అధికారుల తనిఖీలు కొనసాగుతూనే ఉన్నాయి. హైదరాబాద్ ఎల్బీనగర్ లో రవాణా శాఖ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల సందర్భంగా నిబంధనలు ఉల్లంఘించి నడుపుతున్న 11 ప్రైవేటు ట్రావెల్స్ బస్సులను అధికారులు జప్తు చేశారు. రాష్ట్రంలోని మిగతా ప్రాంతాలైన విజయవాడలో 5, కర్నూలులో 5, చిత్తూరులో 3, ఒంగోలులో 3, అనంతపురంలో 3 బస్సులను జప్తు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా గత వారం రోజులుగా ఆర్టీఏ అధికారులు నిర్వహిస్తున్న దాడుల్లో ఇప్పటివరకు 376 బస్సులను జప్తు చేశారు.

  • Loading...

More Telugu News