: ఎర్రబెల్లి వ్యాఖ్యలపై పయ్యావుల స్పందన


పార్టీలో చీడపురుగులున్నారంటూ టీ టీడీపీ సీనియర్ నేత ఎర్రబెల్లి దయాకర్ రావు చేసిన వ్యాఖ్యలపై ఆ పార్టీ సీమాంధ్ర నేత పయ్యావుల కేశవ్ స్పందించారు. ఎర్రబెల్లి వ్యాఖ్యలు తననెంతో బాధించాయన్నారు. అయితే, ఆయన వ్యాఖ్యలను వ్యక్తిగతంగా తీసుకోవడంలేదని చెప్పారు. పార్టీ అంతర్గత సమావేశంలో జరుగుతున్న చర్చలను చూసే ఎర్రబెల్లి అలా మాట్లాడారని పయ్యావుల అన్నారు. తెలంగాణ వాదులు మాట్లాడినప్పుడు తామెవ్వరమూ మాట్లాడలేదన్న ఆయన, తన లక్ష్యం సమైక్యాంధ్రేనని స్పష్టం చేశారు. సమైక్యాంధ్ర నుంచి తన దృష్టిని ఎవ్వరూ మరల్చలేరన్నారు.

  • Loading...

More Telugu News