: అభిమానులు సచిన్ కు థ్యాంక్స్ చెప్పొచ్చు.. బీసీసీఐ ఆఫర్
సచిన్ రిటైర్మెంట్ ను పురస్కరించుకుని బీసీసీఐ అభిమానులకు ఓ ఆఫర్ ఇస్తోంది. ప్రపంచ క్రికెట్ కు మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ చేసిన సేవలకు గుర్తుగా బీసీసీఐ సోషల్ మీడియా వెబ్ సైట్లో #thank you sachin అనే అకౌంట్ ప్రారంభించారు. సచిన్ టెండూల్కర్ కు విశ్వవ్యాప్తంగా ఉన్న అభిమానులు కృతజ్ఞతలు తెలియచేయడానికి ఈ అకౌంట్ ను అందుబాటులోకి తెచ్చింది. అభిమానులు @BCCI #thank you sachin అకౌంట్ ఉపయోగించి మెసేజ్ పంపితే, ఒక్క క్షణంలోనే బీసీసీఐ ట్విట్టర్ అకౌంట్ నుంచి సచిన్ ఆటోగ్రాఫ్ తో ఉన్న పోస్టర్ వస్తుంది.