: పెన్నా సిమెంట్స్ కు కేటాయించిన గనుల లీజు రద్దు
పెన్నా సిమెంట్స్ కు ఎదురు దెబ్బ తగిలింది. సంస్థకు కేటాయించిన గనుల లీజును రద్దు చేసినట్టు ప్రభుత్వం తెలిపింది. ఒప్పందాలను ఉల్లంఘించడంతో గనుల లీజును రద్దు చేసినట్టు ప్రభుత్వం వెల్లడించింది. దీంతో, అనంతపురం జిల్లా తాడిపత్రిలోని తలారి చెరువు దగ్గర పెన్నాకు కేటాయించిన 311 ఎకరాల గనులను ప్రభుత్వం వెనక్కు తీసుకోనుంది.