: యాభై శాతం మధ్యంతర భృతి ఇవ్వాలి : జాక్టో
పదో వేతన సంఘం నివేదిక ఇవ్వడంలో జరుగుతున్న జాప్యం దృష్ట్యా... ఉపాధ్యాయులకు కనీసం 50 శాతం మధ్యంతర భృతి ఇవ్వాలని ప్రభుత్వాన్ని జాక్టో కోరింది. ఆరోగ్య సమస్యలు తలెత్తినప్పుడు ఉపాధ్యాయులకు, వారి కుటుంబ సభ్యులకు చికిత్సకు అయ్యే మొత్తాన్ని ప్రభుత్వమే భరించాలని డిమాండ్ చేసింది. ప్రత్యేక ఉపాధ్యాయులుగా పని చేసిన వారికి నోషనల్ ఇంక్రిమెంట్లు ఇవ్వాలని జాక్టో కోరింది.