: తెలంగాణ ఏర్పాటులో చంద్రబాబు పాత్ర శూన్యం : విద్యాసాగర్ రావు
ప్రతిపక్షనేతగా చంద్రబాబు పూర్తిగా విఫలమయ్యారని బీజేపీ సీనియర్ నేత సీహెచ్ విద్యాసాగర్ రావు అన్నారు. రాష్ట్ర విభజన పట్ల చంద్రబాబు వైఖరి బాధ్యతారాహిత్యంగా ఉందని విమర్శించారు. తెలంగాణ ఏర్పాటులో చంద్రబాబు పాత్ర శూన్యమని వ్యాఖ్యానించారు. బీజేపీ మద్దతు వల్లే తెలంగాణ ఏర్పడుతోందని... తమ పార్టీ మద్దతు ఇవ్వకపోతే తెలంగాణ ఏర్పాటు అసాధ్యమని తెలిపారు. జీవోఎంకు ఇచ్చే నివేదికపై తమ పార్టీకి ఎలాంటి కాలపరిమితి లేదని విద్యాసాగర్ రావు అన్నారు.