: సచిన్ అరుదైన జ్ఞాపకాలు పుస్తక రూపంలో
మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండుల్కర్ సుదీర్ఘ క్రికెట్ కెరీర్ లో విలువైన జ్ఞాపకాలు ఎన్నో ఉంటాయి. వాటన్నింటినీ అభిమానులకు పుస్తక రూపంలో అందిస్తే ఎంత బావుంటుందో కదా? బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ అదే పనిచేసింది. అలాంటి జ్ఞాపకాలతోపాటు, ఫొటోలను కలిపి పుస్తకంగా తీసుకొచ్చింది. అంతేకాదు ఈడెన్ గార్డెన్స్ లో 199వ టెస్ట్ మ్యాచ్ ఆడడానికి ముందు సచిన్ కు ఆ పుస్తకాన్ని బహుమతిగా అందించింది. పుస్తకం కవర్ పేజీగా సచిన్ యువకుడిగా రింగు రింగు జుట్టుతో ఉన్న ఫొటోను ముద్రించారు. సచిన్ యువకుడిగా ఉన్నప్పుడు, అంజలితో వివాహం, కుటుంబంతో వ్యక్తిగతంగా గడిపిన క్షణాలు ఇలా ఎన్నో విశేషాలు ఆ పుస్తకంలో దాగి ఉన్నాయి.