: ఉమ్మడి రాజధాని కాదు.. తాత్కాలిక రాజధాని మాత్రమే : పాల్వాయి
రాష్ట్ర విభజన అనంతరం సీమాంధ్రకు హైదరాబాద్ తాత్కాలిక రాజధానిగా మాత్రమే ఉంటుందని తెలంగాణ కాంగ్రెస్ నేత, రాజ్యసభ సభ్యుడు పాల్వాయి గోవర్ధన్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్ ఉమ్మడి రాజధాని కాదని, తెలంగాణకు మాత్రమే రాజధాని అని అన్నారు. కొంత మంది నేతలు డిమాండ్ చేస్తున్నట్టు రాయల తెలంగాణ సాధ్యం కాదని చెప్పారు. తెలంగాణ ప్రాంతంలో గోదావరి నదిపై రెండు జాతీయ ప్రాజెక్టులు నిర్మించాలని పాల్వాయి డిమాండ్ చేశారు. నగరంలో నివసించే సీమాంధ్రుల కోసం ప్రత్యేక చట్టాలు తీసుకురావాల్సిన అవసరం లేదని అన్నారు.