: 46వ వికెట్ తీసిన సచిన్.. విండీస్ 192/7


భారత్, వెస్టిండీస్ ల మధ్య జరుగుతున్న మొదటి టెస్టు మ్యాచ్ లో విండీస్ ఏడో వికెట్ కోల్పోయింది. 192 పరుగుల వద్ద షిల్లింగ్ ఫార్డ్(5) ను సచిన్ టెండూల్కర్ వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. డిఫెన్స్ ఆడేందుకు వచ్చిన ఫార్డ్, సచిన్ బంతిని అర్థం చేసుకోలేక బోల్తా పడ్డాడు. దీంతో ఎల్బీడబ్ల్యూగా పెవిలియన్ చేరాడు. ఫార్డ్ వికెట్ తో సచిన్ తన టెస్టు క్రికెట్ కెరీర్లో 46 వ వికెట్ సాధించాడు. విండీస్ 63 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 192 పరుగులు చేసింది.

  • Loading...

More Telugu News