: విభజనపై కాంగ్రెస్ ది నిరంకుశ ధోరణి : గాదె
రాష్ట్ర విభజన విషయంలో కాంగ్రెస్ పార్టీ నిరంకుశ ధోరణితో వ్యవహరిస్తోందని ఆ పార్టీ సీనియర్ నేత గాదె వెంకటరెడ్డి ఆరోపించారు. హైదరాబాద్ లో ఏపీజేఎఫ్ ఆధ్వర్యంలో,'రాష్ట్రంలో రాజకీయ గందరగోళ పరిస్థితులకు పరిష్కార మార్గాలు' అన్న అంశంపై చర్చ జరిగింది. ఈ చర్చలో ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర విభజనకు కేంద్ర ప్రభుత్వం ఓ పద్దతి పాటించడం లేదన్నారు. రాష్ట్రం సమైక్యంగా ఉంటేనే అభివృద్ధి సాధ్యమని ఆయన తెలిపారు.