: మాస్టారుకి బడితె పూజ
పాఠశాలలో బాలికల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్న మాస్టారుకి స్థానికులు బడితె పూజ చేశారు. కృష్ణా జిల్లా పెదపారుపూడి మండలం రుద్రప్రగడ గ్రామం జిల్లా పరిషత్ పాఠశాలలో రామకృష్ణ అనే ఉపాధ్యాయుడు బాలికల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని ఆరోపణలు వెల్లువెత్తాయి. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు అతడికి దేహశుద్ధి చేశారు.