: బీజేపీపై ధనస్సు ఎక్కుపెట్టిన శివసేన
ముస్లింలను ప్రసన్నం చేసుకోవడం ద్వారా బీజేపీ అధికారంలోకి రావాలనుకుటోందని ఆ పార్టీ మిత్రపక్షం శివసేన విమర్శించింది. పార్టీ పత్రిక సామ్నాలో బీజేపీ రాజకీయ విధానాలను శివసేన తప్పుబట్టింది. అధికారం కోసం రామమందిరాన్ని మర్చిపోయారంటూ మండిపడింది. బురఖా ధరించిన మహిళలను ఎన్నికల ర్యాలీలకు ఆహ్వానిస్తున్నారంటూ ఎద్దేవా చేసింది. మోడీ ప్రధానమంత్రి అభ్యర్థిత్వానికి ఆమోదం పొందేందుకు అసెంబ్లీ, సాధారణ ఎన్నికల ముందు బీజేపీ ముస్లింలకు దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తోందంటూ సామ్నా సంపాదకీయంలో ఏకిపారేసింది.