: కార్తీక మాసం స్పెషల్.. పంచారామాలకు ఆర్టీసీ బస్సులు


కార్తీక మాసం సందర్భంగా పంచారామాలు, దక్కన్ శైవక్షేత్రాలకు ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్టు ఆర్టీసీ తెలిపింది. హైదరాబాద్ నుంచి ప్రతి ఆదివారం వేములవాడ, కాళేశ్వరం, రామప్ప గుడి, వేయిస్తంభాల గుడి, పాలకుర్తిలకు బస్సులు బయలుదేరుతాయని అధికారులు వెల్లడించారు. పంచారామాల సందర్శనకు 1650 రూపాయలుగా, దక్కన్ శైవ క్షేత్రాలకు వెయ్యి రూపాయలుగా టికెట్టు ధరను నిర్ణయించినట్టు అధికారులు తెలిపారు. బస్సుల రాకపోకల వివరాల కోసం 995 922 6126, 9959 2261 45 నెంబర్లకు ఫోన్ చేసి తెలుసుకోవచ్చని వారు స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News