: నిలకడగా ఆడుతున్న విండీస్... 128/2
భారత్, విండీస్ ల మధ్య జరుగుతున్న మొదటి టెస్టు మ్యాచ్ లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఆరంభించిన వెస్టిండీస్ నిలకడగా ఆడుతోంది. ఆరంభంలోనే ఓపెనర్ల వికెట్లు కోల్పోయిన విండీస్ ఇన్నింగ్స్ ను బ్రావో, శామ్యూల్స్ నిలబెట్టారు. నిలకడగా ఆడుతున్న శామ్యూల్స్ అర్థ సెంచరీ చేశాడు. బ్రావో 16 పరుగులతో క్రీజులో ఉన్నాడు. వీరిద్దరి భాగస్వామ్యంతో విండీస్ 42 ఓవర్లలో 128 పరుగులు చేసింది.