: మోడీకి ప్రధాని స్థాయిలో రక్షణ కల్పించాలి : బీజేపీ


ఐదు రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో ర్యాలీలు, సమావేశాల్లో పాల్గొంటున్న బేజేపీ ప్రధాని అభ్యర్ధి నరేంద్ర మోడీకి... ప్రధాని స్థాయిలో కేంద్రం రక్షణ కల్పించాలని ఆ పార్టీ పార్లమెంటరీ బోర్డు తీర్మానం చేసింది. నిన్న సమావేశమైన బీజేపీ పార్లమెంటరీ బోర్డు ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. పాట్నాలో జరిగిన పేలుళ్లు, మోడీ లక్ష్యంగానే జరిగినట్టు వస్తున్న వార్తల నేపథ్యంలో కమలం పార్టీ ఈ డిమాండ్ చేస్తోంది. ప్రస్తుతం ఉన్నటువంటి సెక్యూరిటీని మరింత పెంచాలని, మోడీ రక్షణ బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదేనని బీజేపీ తెలిపింది.

  • Loading...

More Telugu News