: జాతీయ మార్కెట్ లో చుక్కలనంటిన టమోటా ధర


ఇప్పటికే పెట్రోల్, డీజీల్, ఆర్టీసీ ఛార్జీలు, ఉల్లి ధరలు పెరిగి సామాన్యుడు కుదేలవుతుంటే టమోటా ధర కూడా ఆకాశాన్ని తాకింది. ఈ క్రమంలో ఢిల్లీలో కిలో టమోటా ధర రూ.80 కు చేరింది. రిటైల్ అవుట్ లెట్స్ లో కేజీ టమోటాను అరవై నాలుగు రూపాయలకు అమ్ముతున్నారు. గతవారం నలభై రూపాయలే ఉన్న ధర ఇంతలోనే ఇంతగా పెరగడం స్థానికులకు అంతుబట్టకుండా ఉంది. శీతాకాలం ప్రారంభం కావడంతో హిమాచల్ ప్రదేశ్ నుంచి టమోటా దిగుమతి తగ్గిపోయిందని... దీనికి తోడు మధ్యప్రదేశ్, మహారాష్ట్ర నుంచి కూడా సప్లయ్ పడిపోవడంతో ఈ పరిస్థితి తలెత్తిందని ఢిల్లీలోని అజాద్ పూర్ మండి అమ్మకం దారులు వివరించారు.

  • Loading...

More Telugu News