: ప్రఖ్యాత గజల్ గాయకుడు నజ్మల్ బాపు మృతి
ప్రఖ్యాత గజల్ గాయకుడు నజ్మల్ బాపు తుది శ్వాస విడిచారు. కొంతకాలం నుంచి తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన... గతరాత్రి కేరళలోని మలప్పురమ్ జిల్లా వెంగరలో మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆరోగ్యం సరిగా లేకపోవడంతో కొన్ని సంవత్సరాల నుంచి కచేరీలకు నజ్మల్ దూరంగా ఉంటున్నారు. 65 సంవత్సరాల నజ్మల్ కు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. వారిలో కొడుకు అబ్దుల్ ఖదీర్ గాయకుడిగా పాప్యులర్ అయ్యారు.