: 'యువరాజు' పెళ్లి ముచ్చట ఇప్పట్లో లేదా?


రాహుల్ గాంధీ పెళ్లి కోసం దేశమంతా ఎదురుచూస్తుంటే ... ఆయన మాత్రం ఆ విషయాన్ని ఇంకా దాటవేస్తూనే వున్నారు. అందర్నీ నిరాశపరుస్తూనే వున్నారు. నిన్న కూడా అదే జరిగింది. పార్లమెంటు సెంట్రల్ హాలులో తోటి ఎంపీలతో పిచ్చాపాటీ మాట్లాడినప్పుడు ఇదే విషయం ప్రస్తావనకు వస్తే, ఈ విషయాన్ని ఆయన తేలికగా తీసుకున్నారు. పైపెచ్చు, ఫిలసాఫికల్ గా కూడా మాట్లాడడంతో అంతా నివ్వెరపోయారు.

"పెళ్లి చేసుకుంటే పిల్లలు పుడతారు. ఇక అప్పుడు ఎలా వున్న వాళ్ళం అలా ఉండిపోతాం. పిల్లల్ని మన స్థానంలోకి ఎలా తీసుకురావాలా? అనే ఆలోచిస్తాం" అంటూ రాహుల్ గాంధీ ఫిలాసఫీ చెప్పడంతో, చుట్టూ వున్నా వాళ్ళు మరేం మాట్లాడకుండా నోళ్ళు వెళ్ళబెట్టారు. దీనిని బట్టి చూస్తే మన యువరాజు గారు ఇప్పట్లో పెళ్ళికొడుకు అయ్యే సూచనలు కనపడడం లేదనే చెప్పాలి!                          

  • Loading...

More Telugu News