: వంటకే కాదు... ఒంటికి కూడా మేలుచేస్తుంది
ఇడ్లీలు మెత్తగా రావడానికి, ఇతర వంటకాలకు ఉపయోగించే వంటసోడా కేవలం వంటకాలకే కాకుండా మన శారీరక అందాన్ని కాపాడడానికి కూడా ఉపకరిస్తుంది. ఇందులో ఉండే యాంటీ ఇన్ఫెక్షన్ కారకాలు శరీరానికి ఎంతగానో మేలు చేస్తాయి. చర్మ సంబంధ సమస్యలను దూరం చేస్తాయి. అలాగే బాగా అలసట ఉండేవారు బకెట్ నీళ్లలో కప్పు వంటసోడా, పావుకప్పు బేబీ ఆయిల్ వేసి ఆ నీళ్లతో స్నానం చేస్తే అలసట, ఒత్తిడీ మాయమవుతాయి.
శరీరంపై పేరుకుపోయే మురికినీ, మృతకణాలను తొలగించడంలో వంటసోడా కీలక పాత్ర పోషిస్తుంది. దీనితో చర్మం మృదువుగా తయారవుతుంది. గోళ్లలో మట్టి చేరుకున్న వారికి గోరువెచ్చని నీటిలో కొద్దిగా వంటసోడా వేసి ఆ నీటిలో కాసేపు చేతులను ఉంచి కాసేపటి తర్వాత స్క్రబ్బర్‌తో శుభ్రం చేసుకుంటే చక్కగా మురికి పోతుంది. చేతులపై ఉన్న మృతకణాలు కూడా తొలగిపోతాయి. ఇలా వంటసోడా కేవలం వంటలకే కాకుండా మేనికి కూడా మేలు చేస్తుంది.