: సమైక్యం కోసం అధిష్ఠానాన్ని కలిసే వారితో నేనూ కలుస్తా: పనబాక లక్ష్మి


ఢిల్లీలో కేంద్రమంత్రి కావూరి సాంబశివరావు కార్యాలయంలో సీమాంధ్ర కేంద్ర మంత్రుల భేటీ ముగిసింది. ఈ భేటీకి పురందేశ్వరి, పనబాక లక్ష్మి, జేడీ శీలం, కిల్లి కృపారాణి తదితరులు హాజరయ్యారు. అయితే, సమావేశంలో చర్చించిన విషయాలను మీడియాకు వెల్లడించేందుకు నిరాకరించారు. మంత్రి పనబాక మాట్లాడుతూ.. రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితులపై ప్రధానంగా చర్చించినట్లు తెలిపారు. వీలైతే ప్రధాని, సోనియా, రాహుల్, జీవోఎంను కలుస్తామన్నారు. వారి అపాయింట్ మెంట్ కోసం ప్రయత్నిస్తున్నామని చెప్పారు. గతంలో తాను తెలంగాణకు అంగీకరించానన్న ఆమె.. ఇప్పుడు సమైక్యం కోసం మరోసారి మంత్రులంతా అధిష్ఠానాన్ని కలవనున్నందున తాను కూడా వారితో కలుస్తానని పనబాక చెప్పారు.

  • Loading...

More Telugu News