: హతాఫ్ క్షిపణిని విజయవంతంగా ప్రయోగించిన పాక్
తక్కువ దూరంలో ఉన్న లక్ష్యాలను ఛేదించే హతాఫ్ క్షిపణిని పాకిస్థాన్ విజయవంతంగా ప్రయోగించింది. ఈ క్షిపణి 60 కిలో మీటర్ల పరిధిలోని లక్ష్యాలను ఛేదించగలదు. ఉపరితలం నుంచి ఉపరితల లక్ష్యాలను ఈ క్షిపణి ఛేదిస్తుంది. హతాఫ్ క్షిపణి పరీక్ష విజయవంతమవడం పట్ల పాక్ సైన్యం హర్షం వ్యక్తం చేసింది.