: ఏపీ పరిస్థితుల గురించి అద్వానీ అడిగి తెలుసుకున్నారు: దత్తాత్రేయ
ఢిల్లీలో పార్టీ అధిష్ఠానంతో భేటీ ముగిసిన అనంతరం, రాష్ట్ర బీజేపీ సీనియర్ నేత బండారు దత్తాత్రేయ మీడియాతో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ లోని రాజకీయ పరిస్థితుల గురించి అగ్రనేత అద్వానీ అడిగి తెలుసుకున్నారని తెలిపారు. తెలంగాణ, సీమాంధ్ర ప్రాంతాల అభిప్రాయాలను క్రోడీకరించి జాతీయ నాయకత్వం జీవోఎంకు నివేదిక ఇస్తుందని చెప్పారు. ఈ సందర్భంగా విభజన విషయంలో కాంగ్రెస్ పై మండిపడ్డ దత్తాత్రేయ.. ఆ పార్టీ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించిందన్నారు. ప్రస్తుత అసందిగ్ధతకు కాంగ్రెస్ పార్టీయే కారణమన్నారు. సీడబ్ల్యూసీ తీర్మానం మేరకు కాంగ్రెస్ తెలంగాణ బిల్లు ప్రవేశపెడుతుందో? లేదో? వేచిచూడాలన్నారు.