: ప్రసాదం తిని 45 మంది ఆసుపత్రి పాలు


కష్టాలు తొలగించమని దేవుణ్ణి వేడుకోవడానికి దేవాలయానికి వెళ్లిన భక్తులు... అక్కడి ప్రసాదం తిని ఆసుపత్రి పాలయ్యారు. ఉత్తర త్రిపుర లోని కంచన్ పూర్ లో ఓ దేవాలయంలో జరిగిన కార్యక్రమంలో నిన్న రాత్రి పాల్గొన్న భక్తులు అక్కడి ప్రసాదం తిని అస్వస్థతకు గురయ్యారు. దీంతో అప్రమత్తమైన అధికారులు అస్వస్థతకు గురైన 45 మంది భక్తులను ఆసుపత్రికి తరలించి వైద్య సేవలు అందించారు. వారి కోసం ఇద్దరు వైద్యులను ప్రత్యేకంగా నియమించినట్టు వైద్యశాఖాధికారులు వెల్లడించారు. అయితే వారిలో 15 మంది పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. కాగా ప్రసాదం నమూనాలపై పరీక్షలు నిర్వహిస్తున్నారు.

  • Loading...

More Telugu News