: భారత్ చేరిన ప్రణబ్
బంగ్లాదేశ్ లో మూడు రోజుల పర్యటన ముగించుకుని భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ నేడు స్వదేశానికి విచ్చేశారు. ఈ సాయంత్రం ఢాకాలోని హజ్రత్ షా జలాల్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ప్రధాని హసీనా.. ప్రణబ్ కు ఘనంగా వీడ్కోలు పలికారు. ప్రణబ్ బంగ్లా పర్యటనలో భాగంగా తన అత్తగారి ఊరైన భద్రిబిలాను సతీసమేతంగా సందర్శించారు. కాగా, ఢాకా యూనివర్శిటీ ప్రణబ్ ను డాక్టరేట్ తో గౌరవించింది.